Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరీ రాజిష విజయన్? ఎలా సినిమాల్లోకి తీసుకువచ్చారంటే..?

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (17:20 IST)
జై భీం సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని మరల్చింది. గిరిజనుల నిజజీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాను ఎంతో ఆశక్తిగా ప్రేక్షకులు తిలకిస్తున్నారు. ఓటీటీ వేదికగా రిలీజైన సినిమా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. సక్సెస్, ఫెయిల్యూర్ లతో అస్సలు సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు సూర్య. అయితే ప్రస్తుతం రిలీజైన జైభీం సినిమా మాత్రం భారీ విజయాన్ని సాధించిందన్న నమ్మకంలో ఉన్నారు సినీ టీం.

 
అయితే ఈ సినిమాలో సూర్యతో పాటు లీజోమోల్ జోసీలదే ప్రధాన పాత్రలని అందరూ భావించారు. కానీ వీరితో పాటు రాజిష విజయన్ అనే యువతి కూడా నటించింది. సూర్యతో పాటు లీజోమోల్ జోసీల పక్కనే ఈమె క్యారెక్టర్ తిరుగుతూ ఉంటుంది. 

 
ఈ సినిమాలో ఆమెది కూడా కీలక పాత్ర అని, అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు ఇప్పుడు ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజిష సినిమాల్లోకి రాకముందే యాక్టర్. పలు తమిళ సీరియళ్ళలో నటించడంతో పాటు యాంకర్‌గా వ్యవహరించారు. అంతేకాదు మళయాళం సినిమాల్లోను నటించారు.

 
దీంతో ఆమెకు జైభీంలో నటించే అవకాశం వచ్చిందట. రాజిష తండ్రి ఆర్మీలో పనిచేసేవారట. ఆయన పేరు విజయన్. తల్లి హౌస్ వైఫ్. మళయాళంలో ఆమె నటించిన చిత్రాలకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా లభించిందట.

 
తమిళంలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ రావడంతో ఒప్పుకుందట రాజిష. ఈ సినిమాలోను తనకు మంచి పేరు రావడం.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వస్తుండడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారట. సినిమాను చిత్రీకరించిన జ్యోతిక, సూర్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments