Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాన్ ఇండియా మూవీకి `హరహర వీరమల్లు` టైటిల్‌?

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (19:17 IST)
Pavan Kalyan, veeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన `వీక‌ల్‌సాబ్‌` సినిమా పూర్త‌యిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమా పూర్త‌య్యాక ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాల‌వైపు దృష్టి సారిస్తున్నాడు ప‌వ‌న్‌. తాజాగా అయన `అయ్యప్పనం కోషియం` అనే సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా తరువాత అయన క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే నెలలో మొదలెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.
 
ఇప్ప‌టికే ఈ సినిమా కోసం `విరూపాక్ష` అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ చారిత్రాత్మ‌క నేప‌థ్యం సినిమా చేయ‌లేదు. ఇది ఆ త‌ర‌హా సినిమాగా వుంటుంద‌ని స‌మాచారం. అందుకే త‌గిన‌ట్లుగా టైటిల్ పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ టైటిల్‌గా వీర‌మ‌ల్లు పెట్టి క్లాప్ కొడుతూ షూటింగ్‌ను కొన‌సాగిస్తున్నారట‌. వీర‌మ‌ల్లు అనేది ప‌వ‌న్ సినిమాలో న‌టించే పాత్ర‌. క‌నుక అదే పెడితే బాగుంటుంద‌ని యూనిట్ భావిస్తోంది. దీనికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే వెంట‌నే ప్ర‌క‌టించే వీలుంటుంది. ప‌వ‌న్ కెరీర్‌లో పాన్ ఇండియా సినిమాగా దీనిని తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే కెజిఎఫ్‌.. వంటి సినిమాలు పాన్ ఇండియాగా పేరు తెచ్చుకోవ‌డంతో ప‌వ‌న్ కూడా ఆ త‌ర‌హా సినిమా చేయాల‌ని వుండేద‌ట‌. అందుకు త‌గిన విధంగా వినూత్న‌మైన క‌థ‌ను ఎన్నుకున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments