Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కంటే కొంచెం తక్కువ.. సాయిపల్లవి డిమాండ్ ఎంత?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (23:14 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. అతనికి జోడీగా సాయి పల్లవి కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇందుకోసం చైతూ నేరుగా రంగంలోకి దిగి మత్స్యకారులకు సంబంధించిన విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాడు. ఇంకా ఈ పాత్ర కోసం చాలా హోమ్‌వర్క్ కూడా చేశాడు. 
 
నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వీరిద్దరూ నటించిన లవ్ స్టోరీ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. సాయి పల్లవి కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం. ఈ సినిమాకు గాను నాగ చైతన్య కేవలం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: ఆటోలో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments