Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (19:03 IST)
సైరా సినిమాతో అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి పేరు సంపాదించిన డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి ప్ర‌పంచ వ్యాప్తంగా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజ్ అయింది. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఎంతో శ్ర‌మించి 5 భాష‌ల్లో ఈ సినిమాని రూపొందించారు. 
 
అయితే... ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.... యువ హీరో నితిన్‌తో సురేంద‌ర్ రెడ్డి సినిమా చేయ‌నున్నార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ట‌. నితిన్ ప్ర‌స్తుతం ఛ‌లో డైరెక్ట‌ర్ వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేస్తున్నాడు. సితార ఎంట‌ర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. 
 
ఈ సినిమాతో పాటు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు చంద్ర‌శేఖ‌ర్ యేల‌ేటి ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ సినిమా, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఇలా వ‌రుస సినిమాల‌తో నితిన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మే అయితే... సురేంద‌ర్ రెడ్డితో చేయ‌నున్న సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments