Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ - శ్రియాభూపాల్ పెళ్లి రద్దా? పోస్ట్‌పోనా...? ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, ప్రముఖ డిజైనర్ శ్రియాభూపాల్ రెడ్డిల వివాహం రద్దు చేసుకుంటున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ఇరు కుటుంబాల సభ్యులు ఇటలీ వెళ్లేందుకు బుక్ చేసుకున్న ఎయిర్ టిక్కెట్లను సైతం రద

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:50 IST)
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, ప్రముఖ డిజైనర్ శ్రియాభూపాల్ రెడ్డిల వివాహం రద్దు చేసుకుంటున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా ఇరు కుటుంబాల సభ్యులు ఇటలీ వెళ్లేందుకు బుక్ చేసుకున్న ఎయిర్ టిక్కెట్లను సైతం రద్దు చేసుకున్నట్టు వినికిడి. అయితే, వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌‍ల నిశ్చితార్థం జీవీకే హౌస్‌లో గత డిసెంబర్ 9న అట్టహాసంగా జరిగింది. అలాగే, పెళ్లిని హైదరాబాద్‌లో కాకుండా, ఇటలీలోని రోమ్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ పెళ్లికి 700 మంది ప్రముఖులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్టుగానే ఇటలీలో హోటల్స్, రిసార్ట్స్ అన్నీ బుక్ చేశారు. పెళ్లి వేదికను కూడా బుక్ చేశారు. ట్రావెల్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. 
 
ఈనేపథ్యంలో, వారం చివరి వరకు కూడా అంతా బాగానే ఉందట. ఇపుడు ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే నిర్ణయానికి ఇరు కుటుంబాలు వచ్చాయి. పెళ్లికి హాజరు కావడానికి ఇటలీకి ఎయిర్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న కొందరికి... ఇరు కుటుంబాలను నుంచి సమాచారం వెళ్లింది. టికెట్లను బుక్ చేసుకోవద్దంటూ వారికి సూచించారు. అంతేకాదు, ఇరు కుటుంబాలు కూడా ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాయి. 
 
ఈ రెండు కుటుంబాలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం, హఠాత్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లి ఆగిపోవడం వల్లే, టికెట్స్ బుక్ చేసుకోవద్దంటూ ఇరు కుటుంబాలు సూచించినట్టు సమాచారం. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడికావాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments