Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (19:56 IST)
ఫలక్‌నుమా దాస్ సినిమాతో యూత్‌ని బాగా ఆకట్టుకుని.. సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో విశ్వక్ సేన్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డైలాగ్స్ చాలా సహజంగా వాడుక భాషలో ఉండడంతో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కి నేచురల్‌గా నటించే మరో హీరో వచ్చాడు అనిపించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటన సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ఫలక్ నుమా దాస్ మూవీకి విశ్వక్ సేన్ రైటర్‌గా, డైరెక్టర్‌గా, హీరోగా పలు పాత్రలు పోషించాడు. అయితే.. రైటర్‌గా హీరోగా మాత్రం అద్భుతంగా రాణించాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ నటించిన సినిమా హిట్.
 
ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని నిర్మించడం విశేషం. ఈ చిత్రం ద్వారా శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీసాఫీసర్‌గా నటించారు. అగ్రెస్సివ్ పోలీస్‌గా అతని డైలాగ్ డెలివరీ.. మేనరిజం.. చాలా సహజంగా అనిపిస్తాయి. ఎమోషనల్ మరియు సీరియస్ సీన్లలో విశ్వక్ సేన నటన బాగా ఆకట్టుకుంది. ఈ థ్రిల్లర్ మూవీతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలక్ నుమా దాస్, హిట్.. ఇలా రెండు సినిమాలతో వరుసగా విజయాలు సాధించిన విశ్వక్ సేన్ బిగ్ బ్యానర్లో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకీ ఏ బ్యానర్ లో అంటారా... టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో. అవును.. దిల్ రాజు ఓ వైపు స్టార్ హీరోలు మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తదితర హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ నిర్మిస్తూనే.. మరోవైపు రాజ్ తరుణ్ తదితర హీరోలతో చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. కథ బాగుంది అనుకుంటే చాలు.. ఆయన ఎవరితో అయినా.. సినిమా చేయడానికి రెడీ అంటారు. ఇప్పుడు విశ్వక్ సేన్‌తో ఓ సినిమా నిర్మించనున్నారని తెలిసింది. ఈ సినిమా ద్వారా నరేష్ కొప్పల్లి దర్శకుడిగా పరిచయం కానున్నారు.
 
కొత్త డైరెక్టర్ నరేష్‌ వినిపించిన కథ కొత్తగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో, ఈ సినిమా చేయడానికి నిర్మాత దిల్ రాజు అంగీకరించారని తెలిసింది. ఈ సినిమాకి సహనిర్మాతగా బెక్కం వేణుగోపాల్ వ్యవహరించనున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఆరంభించడానికి ప్లాన్ చేసారు. 
 
అయితే... ఈ సినిమాలో నటించే హీరోయిన్, విలన్ మిగిలిన నటీనటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నారని సమాచారం. మరి.. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో విజయం సాధించిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో కూడా సక్సస్ సాధిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments