Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విశాల్‌'మైన హృదయం.. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన హీరో

తమిళ సినీ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ వివరాలను పరిశ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:17 IST)
తమిళ సినీ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మరోమారు తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వివరాలను పరిశీలిస్తే... ఈ నెల 19న చెన్నైలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును అడ్డదిడ్డంగా నడిపి 13 ఆటోలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఆర్ముగం (28) అనే ఆటో డ్రైవర్ ఆటోనే నిద్రిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు విశాల్ ముందుకు వచ్చాడు. 
 
నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కాకముందు నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టిన కోలీవుడ్ నటుడు విశాల్‌, చెన్నైలో వరదల సమయంలో సంఘ సభ్యులతో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రమాదంలో ఆర్ముగం మృతిచెందడంతో అతని కుటుంబం దిక్కులేనిదైందని తెలుసుకున్నాడు. 

దీంతో తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి తాలూకా అక్కూరు గ్రామానికి వెళ్లిన విశాల్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. కుటుంబం నిలదొక్కుకునేందుకు ఆర్ముగం భార్యకు కిరణా షాపు పెట్టుకునేందుకు సాయం చేస్తానని, వారి కుమార్తె మనీషా (7) చదువుకయ్యే ఖర్చును ఒక అన్నగా భరిస్తానని మాట ఇచ్చాడు. విశాల్ మంచి మనసుకు అభిమానులు మరోసారి ఫిదా అయిపోయారు.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments