Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా విఘ్నేశ్ శివన్.. హీరోయిన్‌గా నయనతార.. కొత్త సినిమా ప్రారంభం?

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్నారనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రస్తుతం ఫారి

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (14:14 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్నారనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు ప్రస్తుతం ఫారిన్ ట్రిప్పులతో బిజీ బిజీగా వున్నారు. 
 
ఈ నేపథ్యంలో విఘ్నేశ్ ఓ కొత్తను రెడీ చేసుకుని.. అందులో హీరోయిన్ రోల్ కోసం నయనతారను ఎంపిక చేసుకునేందుకు రంగం సిద్ధంచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర కోసం విఘ్నేష్ మల్లగుల్లాలు పడుతుంటే.. హీరోగా ఎవరో ఎందుకు.. ఆ పాత్ర నువ్వే చేసేయ్ అని నయనతార అందట. అంతేగాకుండా నయనతారను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఎవరు సంప్రదించినా హీరోగా విఘ్నేశ్‌ను తీసుకోవాలని కొత్తగా షరతు పెడుతుందట. 
 
ఇదిలా ఉంటే.. విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ తాజా చిత్రం తెర‌కెక్క‌ుతోంది. వీరం, వేదాళం, వివేగం సినిమాల‌ ద‌ర్శ‌కుడు శివ‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా క‌నిపించ‌నుండ‌గా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై త‌మిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెప్తాడని స‌మాచారం. విశ్వాసం చిత్రంలో అజిత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌నుంది. 
 
గ‌తంలో అజిత్‌తో క‌లిసి తొలిసారిగా ఏగన్ అనే చిత్రం చేసింది న‌య‌న‌తార. ఆ త‌ర్వాత‌ బిల్లా, ఆరంభం అనే చిత్రాల్లోనూ క‌లిసి న‌టించారు. ప్రస్తుతం విశ్వాసం చిత్రంతో అజిత్, నయనతార నాలుగో సారి జ‌త‌క‌డుతున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసి.. అజిత్‌, న‌య‌న్‌ల‌పై ఓ రొమాంటిక్ సాంగ్ తీస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments