Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి ఫిక్స్..

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (22:40 IST)
Daggubati Family
విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని వివాహానికి సిద్ధమవుతోంది. దీంతో దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. విజయవాడకు చెందిన ఓ వైద్యుడి కుటుంబానికి ఆమె కోడలు కాబోతోంది. విజయవాడలో నిశ్చితార్థ వేడుక జరిగిందని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ "సైంధవ్" సినిమాలో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు.
 
వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జైపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్‌లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
 
కాగా, వెంకటేష్ మూడో కుమార్తె భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగనుందనే సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments