Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సింగిల్‌గా హ్యాపీగా వున్నానన్న వనిత.. నెటిజన్‌కు షాకింగ్ యాన్సర్

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (23:03 IST)
నటి వనిత విజయ్ కుమార్ అంటే అందరికీ పరిచయమైన పేరు. ఎందుకంటే ఆమె చేసే పనులన్నీ వివాదాస్పదం. ఇప్పటికే మూడో పెళ్లి చేసుకుని పాపులరైన ఈ భామ.. ఇటీవలే మూడో భర్తకు దూరమైన విషయం తెలిసిందే. ఇక 2000సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను వనిత వివాహం చేసుకున్నారు.

ముగ్గురు పిల్లలకు జన్మనించిన తర్వాత అతడికి విడాకులు ఇచ్చారు. ఆతర్వాత 2007లో ఓ బిజినెస్ మ్యాన్ ను వివాహమాడింది. ఆయనతో ఐదేళ్ళు కాపురం చేసిన తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు ప్రేమాయణం సాగించింది. ఆ తరవాత 2017లో అతడితో విడిపోయింది.
 
ఇక పీటర్ పాల్ తన మొదటి భార్య ఎలిజబెత్‌ను మోసం చేసి వనితను పెళ్లి చేసుకున్నారు. తనకుచెప్పకుండా, తనతో ఇంకా విడాకులు కాకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నారంటూ ఎలిజబెత్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే బర్త్ డే వేడుకలకు గోవాకు వెళ్లడం, అక్కడ పీటర్ పాల్ తీరు నచ్చకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారట వనిత. ఈ మేరకు మూడో పెళ్లి కూడా పెటాకులైందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 
 
తాజాగా వనిత విజయ్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాను సింగిల్‌గా ఉన్నాను అలాగే హ్యాపీగా ఉన్నాను అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది వనిత. దీనిపై ఓనెటిజన్ ఫైర్ అయ్యాడు. ఎదిగినా పిల్లలున్నారు అయినా బాధ్యత లేకుండా సింగిల్ అని పోస్ట్ పెట్టటమేంటి అంటూ కామెంట్ పెట్టారు. మరి కొంతమంది మరో పెళ్ళికి రెడీ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్స్ కామెంట్స్‌కు ఘాటుగా స్పందించారు వనిత. ఎలా ఉండాలో మాకు తెలుసు.. , నీపని నువ్వు చూసుకో అంటూ రిప్లే ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments