Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2'కి రూ.750 కోట్ల లాభం వస్తే... దర్శకుడు రాజమౌళికి రూ.250 కోట్లు!

బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్‌ను అందుకోనున్నట్టు సమాచారం. గతనెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (12:02 IST)
బాహుబలి 2 చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్‌ను అందుకోనున్నట్టు సమాచారం. గతనెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. పైగా, వసూళ్ల సునామీని సృష్టించి అత్యధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టిన తొలి భారతీయ సినిమాగా ఆవిర్భవించే దిశగా దూసుకెళుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక దిగ్గజం రాజమౌళికి నిర్మాతలు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంత? ఈ ప్రశ్నే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైంది. ఏకంగా ఐదేళ్లపాటు కాలాన్ని వెచ్చించిన రాజమౌళికి భారీ మొత్తమే అందనున్నట్టు తెలుస్తోంది.
 
తన ప్రతిఫలం ఇంత అని ముందుగా ఓ మాట అనుకోకుండా లాభాల్లో మూడింట ఒక వంతును ఇచ్చేట్టుగా జక్కన్న ముందుగానే నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
అంటే, సినిమా ఖర్చులుపోగా, లాభం రూ.750 కోట్లు మిగిలితే, అందులో రాజమౌళికి వాటా కింద రూ.250 కోట్లు వస్తుందని సినీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ విషయంలో అధికారిక సమాచారాన్ని అందించేందుకు ఎవరూ ఇష్టపడకపోయినా, ఆయన పడిన కష్టానికి ఆ మాత్రం ప్రతిఫలం లభించాల్సిందేనని అత్యధికులు భావిస్తున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments