Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత- వరుణ్ ధావన్ సిటాడెల్... లిప్ లాక్‌తో పాటు ఆ సీన్లు కూడా..?

Webdunia
మంగళవారం, 23 మే 2023 (17:21 IST)
Samantha Ruth Prabhu
సమంత- వరుణ్ ధావన్ సిటాడెల్ కోసం కొన్ని హాట్ సన్నివేశాలను పండించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్ స్పై థ్రిల్లర్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో సమంత- వరుణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
ఇండియన్ వెర్షన్‌ను రాజ్ - డికె హెల్మ్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక తరహాలో సమంత తన రోల్‌కు న్యాయం చేస్తూ.. వరుణ్ ధావన్‌తో రొమాన్స్ పండించేందుకు అంగీకరించిందని టాక్ వస్తోంది. 
 
ఒరిజినల్ వెర్షన్ లాగా, సిటాడెల్ ఇండియా కూడా లిప్-లాక్ సన్నివేశాలను కలిగి ఉంటుందని సమాచారం. అంతేగాకుండా.. ఈ సిరీస్‌లో కొనసాగుతున్న వెర్షన్‌లో ప్రియాంక-రిచర్డ్ మధ్య ఉన్నటువంటి బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై సమంత స్పందిస్తూ.. సిటాడెల్ ఇండియా రీమేక్ కాదని.. సిరీస్‌లో కొత్తదనం వుంటుందని చెప్పుకొచ్చింది. 
 
దక్షిణాది అగ్ర హీరోయిన్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించింది. అలాగే పుష్పలో పాటకు అదరగొట్టింది. అయితే గత సంవత్సరం, దురదృష్టవశాత్తు సమంత మైయోసిటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాని నుంచి ఆమె కోలుకుంది. శాకుంతలం సినిమాలో అద్భుతంగా నటించింది. 
 
అయితే తాజాగా ట్విట్టర్‌లో ఒక ఫోటోలో ఆమె తన ఆకర్షణను, మెరుపును కోల్పోయిందని పోస్ట్ చేయడం ద్వారా ఆమెను ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇందుకు ఆమె ట్రోల్స్ చేసేవారికి గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాజా సిటాడెల్ ద్వారా తన మెరుపును తిరిగి పొందేలా అందాల ఆరబోతకు సిద్ధమంటోంది. మరి సిటాడెల్ సమంతకు ఎంతమేరకు కలిసొస్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments