''టబు''ను తీసుకుందామన్న త్రివిక్రమ్.. వద్దన్న ఎన్టీఆర్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలనాటి అందాల రాశి టబును ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే టబు పాత్ర పరంగా సెట్ కాదని ఎన్టీఆర్ చ

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (09:40 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలనాటి అందాల రాశి టబును ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే టబు పాత్ర పరంగా సెట్ కాదని ఎన్టీఆర్ చెప్పడంతో త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 
 
త్రివిక్రమ్‌పై పూర్తి నమ్మకంలో ఈ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కథాపరంగా కొన్ని సలహాలు  కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టబును తీసుకుందామన్న త్రివిక్రమ్ నిర్ణయాన్ని ఆయన పక్కనబెట్టాలనుకుంటున్నారట. 
 
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గత సినిమాలైన 'అత్తారింటికి దారేది'లో నదియాను, 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఖష్బూను తీసుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం టబును తీసుకుంటాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
 
కాగా ఇప్పటికే టబు టాలీవుడ్‌లో బిజీ బిజీ అవుతోంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించే చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోందని.. అలాగే అక్కినేని నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ రూపొందించే చిత్రంలోనూ టబు తీసుకోబోతున్నట్లు ఫిలిమ్ నగర్  వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments