Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత పాత్రలో త్రిష.. మేమిద్దరం ఒకే స్కూల్‌లో చదువుకున్నాం...

నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం 'కొడి'. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. దర్శకుడు వెట్ట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:31 IST)
నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం 'కొడి'. ఆయన తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌లు నాయికలుగా నటించారు. దర్శకుడు వెట్ట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై వంటి విజయవంతమైన చిత్రాల ఫేమ్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. సంతోష నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌తో దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 28న విడుదల కానుంది. 
 
కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సందర్భంగా త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బయోగ్రఫీల హవా నడుస్తోందని, బాలీవుడ్‌లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని చెప్పింది. 
 
తామిద్దరం ఒకే స్కూల్ (చర్చ్ పార్క్)లో చదువుకున్నామని గుర్తుచేసింది. జయలలిత జీవితం స్ఫూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని తెలిపింది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని త్రిష తెలిపింది. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైనా టాప్ హీరోయిన్‌గానే చెలామణి అవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments