Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యారాయ్ తల్లి బృందా రాయ్ గర్భంగా ఉన్నప్పుడు నా ఫోటోలే ఎక్కువగా చూస్తుండేది!

అందం అంటే ఆమెదే.. ప్రపంచం ఆమె అందానికి దాసోహం అంది. కుర్రకారు మొద‌లుకుని సినీ నిర్మాత‌ల వ‌ర‌కూ ఆమె అందానికి ఆక‌ర్షితులే. ప్రపంచ సుంద‌రి కిరీటాన్ని త‌న సిగ‌లో చేర్చుకున్న త‌ర్వాత కూడా అదే అందచందాల‌ను ఒ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:11 IST)
అందం అంటే ఆమెదే.. ప్రపంచం ఆమె అందానికి దాసోహం అంది. కుర్రకారు మొద‌లుకుని సినీ నిర్మాత‌ల వ‌ర‌కూ ఆమె అందానికి ఆక‌ర్షితులే. ప్రపంచ సుంద‌రి కిరీటాన్ని త‌న సిగ‌లో చేర్చుకున్న త‌ర్వాత కూడా అదే అందచందాల‌ను ఒల‌క‌పోసింది… ఆమె ఎవ‌రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆమె ఐశ్వర్యరాయ్ అని అందరికి ఇట్టే తెలిసిపోతుంది. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ పొందింది మొదలు ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళలను ఎంతగానో ప్రభావితం చేశారు. సాంప్రదాయ సుడిగుండంలో చిక్కుకోకుండా ఐష్ తన ప్రతిభకు మెరుగులు పెడుతూనే వ‌చ్చారు. 
 
వివాహానంతరం కూడా ఆమె తన కెరీర్ గ్రాఫ్‌నూ పెంచుకుంటూనే వచ్చారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాస్త శ‌రీరానికి విరామం ఇచ్చారు. ఇంతకాలం ఐష్ అంత‌టి అందాన్ని ఎలా కాపాడుకోగ‌లిగారనేది చాలా మందికి తెలియ‌దు. అయితే ఈ మాజీ సుందరి అందం రహస్యం వెనకున్నది ఓ మహిళ. ఆమె ఎవరో కాదు అలనాటి అందాల నటి రేఖ. ఏంటీ... ఆశ్చర్యపోతున్నారా... ఐష్‌ అందానికి రేఖకు సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా? ఆదివారం రాత్రి ముంబైలో ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. ఐష్‌, రేఖలతో పాటు ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఐష్‌ తల్లి బృందా రాయ్‌ గర్భిణిగా ఉన్నప్పుడు తన ఫొటోలే ఎక్కువగా చూస్తుండేదని, అమ్మ కడుపులో ఉన్న ఐష్‌ తల్లి కళ్ల ద్వారా తనని చూస్తుండేదని అందుకే ఇంత అందంగా పుట్టిందని చెప్పారు. అది విని ఒక్కసారిగా అందరూ నోరెళ్లబెట్టి నిజమా.. అన్నట్లు చూస్తుండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఏదో సరదాగా చెప్పాను.. అని రేఖ నవ్వేయడంతో అందరూ తేరుకున్నారు. కానీ ఐష్‌, రేఖలు మాత్రం స్టేజ్‌పైన అందాల దేవతలుగా మెరిసిపోవడంతో ఆడియన్స్‌తో పాటు ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments