Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పద్మావతి'' కోసం షాహిద్ కపూర్ Vs రణవీర్ సింగ్.. భన్సాలీ కోపమెందుకు..?

ప్రేమకథలు.. అవి సుఖాంతమైనా, విషాదాంతమైనా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తుంటారు ప్రముఖ హిందీ సినీ దర్శక - నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. ''దేవదాస్'', ''సావరియా'', ''గోలియోం కీ రాస్‌లీలా... రామ్-లీల'',

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:10 IST)
ప్రేమకథలు.. అవి సుఖాంతమైనా, విషాదాంతమైనా హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తుంటారు ప్రముఖ హిందీ సినీ దర్శక - నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. ''దేవదాస్'', ''సావరియా'', ''గోలియోం కీ రాస్‌లీలా... రామ్-లీల'', ''బాజీరావ్ మస్తానీ'' తదితర చిత్రాలను తనదైన శైలిలో రూపొందించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. తాజాగా మరో చారిత్రక ప్రణయగాథను తెరకెక్కించే ప్రయత్నంలో భన్సాలీ ఉన్నారు. 12, 13శతాబ్దాలలో ఖిల్జీ వంశానికి చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, అప్పటి చిత్తోడ్ మహారాణి పద్మావతి జీవితాల ఆధారంగా ఈ చారిత్రక కథాచిత్రం ఉంటుంది. 
 
రాణి మీద మనసుపడ్డ అల్లావుద్దీన్ ఆమె భర్త అయిన రాజా రతన్ సింగ్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. తెలివైనవాడు, మొండివాడైన అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలాగైనా పద్మావతిని దక్కించుకొని తీరాలనే పట్టుదలతో ఉంటాడు. అల్లావుద్దీన్‌ని ఎదుర్కోవడానికి చివరకు రాణి రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఈ చరిత్ర ఆధారంగానే "పద్మావతి'' టైటిల్‌తో సినిమా తీయనున్నారు భన్సాలీ. కాగా ఈ సినిమాలో రణ్‌వీర్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రలో, షాహిద్‌ కపూర్ పద్మావతి భర్త రావల్‌ రతన్‌ సింగ్‌ పాత్రలో నటించాల్సి ఉంది. కానీ రణ్‌వీర్‌కి అది ఇష్టంలేదు. 
 
షాహిద్‌ తనకి సమానమైన పాత్రలో నటిస్తే ఒప్పుకోనని షాహిద్‌కి సినిమాలో అతిథి పాత్ర ఇవ్వాలని రణ్‌వీర్‌ పట్టుబడుతున్నాడట. కానీ ఇది భన్సాలీకి ఇష్టంలేదు. ఎందుకంటే షాహిద్‌, రణ్‌వీర్‌లు బాలీవుడ్‌లో టాప్‌ కథానాయకులు. కాబట్టి ఇద్దరికీ సమాన పాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రణ్‌వీర్‌ చెప్పినట్లు షాహిద్‌కి అతిథి పాత్ర ఇస్తే అతను సినిమా నుంచి తప్పుకొంటాడు. అప్పుడు సినిమా చిత్రీకరణ అర్ధాంతంగా నిలిచిపోతుంది. దీంతో విసుగుచెందిన భన్సాలీ రణ్‌వీర్‌పై చాలా కోపంగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు ఇకమీదట రణ్‌వీర్‌తో కలిసి పని చేయనని సన్నిహితులతో అన్నారట. మరి ఈ విషయంలో రణ్‌వీర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments