నాగార్జున స‌ర‌స‌న‌ కాజ‌ల్ అగ‌ర్వాల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:13 IST)
Kajal Agarwal
నాగార్జున తాజా సినిమా `బంగార్రాజు`. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో ముగింపు ద‌శ‌కు చేరుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల‌ను ఈనెల 25 నుంచి హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత నాగార్జున మ‌రో నూత‌న చిత్రం చేస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ కూడా పూర్త‌యింది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
 
కానీ నాగార్జున‌తో ఆమె న‌టించ‌డానికి స‌సేమిరా అంటోంది. ఇప్ప‌టికే ఆమెకు సంబంధించిన ఐదు రోజుల షూట్ కూడా చేశారు. ఆ త‌ర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ తేల‌డంతో డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు షూటింగ్‌లో పాల్గొన‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు రామ్మోహ‌న్‌కు తెలియ‌జేయ‌డంతో ఆయ‌న కూడా ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ కూడా వాప‌సు తీసుకోకుండా ఆమెను షూటింగ్ స్పాట్‌లో చిన్న పత్కారం చేశాడు. నాగార్జున ఈ విష‌యం తెలుసుకుని మాతృమూర్తి కాబోతున్నందుకు ఆనందంగా వుందంటూ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
ఇప్పుడు ఆమె స్థానంలో మ‌రో క‌థానాయిక‌ను తీసుకోవాల్సి వుంది. ఇప్ప‌టికే ప‌లువురు పేర్ల‌ను ప‌రిశీలించారు. త్వ‌ర‌లో ఎవ‌ర‌నేది తెలియ‌జేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments