Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శివాయ్''కు నెగటివ్ ప్రచారం.. కరణ్ జోహార్ నుంచి రూ.25లక్షలు తీసుకున్న ఖాన్?

బాలీవుడ్‌లో కమల్ ఆర్ ఖాన్ అనే వ్యక్తి ఓ జోకర్ లాంటి వాడు. అతన్ని అక్కడ ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే కమల్ ఆర్ ఖాన్‌కు కావాలని ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం, పబ్లిసిటీ సంపాదించుకోవడం అతని అలవాటు. ఇతగాడు సంచ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:05 IST)
బాలీవుడ్‌లో కమల్ ఆర్ ఖాన్ అనే వ్యక్తి ఓ జోకర్ లాంటి వాడు. అతన్ని అక్కడ ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే కమల్ ఆర్ ఖాన్‌కు కావాలని ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం, పబ్లిసిటీ సంపాదించుకోవడం అతని అలవాటు. ఇతగాడు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ అని అందరికి తెలిసిన విషయమేయ. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌డం, వార్త‌ల‌కు ఎక్క‌డం ఈయ‌న‌గారికి అల‌వాటే. ఇప్పుడు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్, నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ మధ్య అగ్గి రగిలించాడు. అజయ్ హీరోగా నటించిన చిత్రం శివాయ్. 
 
ఈ చిత్రం దీపావళికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే...అజయ్‌ దేవగన్‌ కొత్త సినిమా ''శివాయ్‌''కు నెగెటివ్‌ ప్రచారం చేయడానికి కరణ్ జోహార్ నుండి రూ.25 లక్షలు తీసుకున్నాడట ఖాన్. కమల్‌ ఆర్‌.ఖాన్‌ ఈ విషయంపై మాట్లాడుతున్న ఆడియో క్లిప్‌ సోషల్ మీడియాలో దొరికింది. ఈ ఆడియో క్లిప్‌ను స్వయంగా అజయ్‌ దేవగన్‌ తన పేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. నిజానికి అక్టోబరు 28న ''శివాయ్''’తో పాటుగా కరణ్‌ జోహార్‌ మూవీ ''యే దిల్‌ హై ముష్కిల్‌'' కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. దీనికోసం కరణే కమల్‌తో తన సినిమాని నెగిటివ్ చేయమని మాట్లాడుతున్నట్లు ఇందులో వుంది. 
 
దీనిపై అజయ్ మాట్లాడుతూ..''నేను పాతికేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాను. నా తండ్రి కూడా ఇక్కడే పనిచేశారు. అందుకే ఈ రంగంతో నాకు ఎంతో అనుబందం ఉంది. ఇలాంటి రంగంలో కమాల్‌ ఆర్‌ ఖాన్‌ లాంటి వాళ్లు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వాళ్లే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్‌ చేయడం బాధాకరం. ఈ విషయంలో ఎవరి ప్రమేయం వుందో విచారణ జరగాలని'' అంటున్నాడు అజయ్. అయితే ఈ విషయంపై కరణ్ ఇంకా స్పందించలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments