Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రేట్ డైరెక్టర్‌ని 'పిల్ల' హీరోలు కూడా లెక్క చేయడం లేదట...

సినీ ఇండస్ట్రీ అంటేనే అంత. సక్సెస్ ఇచ్చే దర్శకుడు ఎలాంటి వాడైనా... అంటే, నటీనటులను తూలనాడటం, గట్రా మనస్తత్వం వున్నటువంటివాళ్లను కూడా నెత్తికెత్తేసుకుంటుంది. వరుసగా రెండుమూడు ప్లాపులు వచ్చాయా... ఇక అంతేసంగతి. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం పరిస్థితి కూ

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:36 IST)
సినీ ఇండస్ట్రీ అంటేనే అంత. సక్సెస్ ఇచ్చే దర్శకుడు ఎలాంటి వాడైనా... అంటే, నటీనటులను తూలనాడటం, గట్రా మనస్తత్వం వున్నటువంటివాళ్లను కూడా నెత్తికెత్తేసుకుంటుంది. వరుసగా రెండుమూడు ప్లాపులు వచ్చాయా... ఇక అంతేసంగతి. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం పరిస్థితి కూడా ఇలాగే వుందంటున్నారు. ప్రతి నటుడు ఆయన పేరు చెప్పి ఆకాశానికెత్తేయడమే కానీ, ఆయన తన వద్ద కథ వుంది సినిమా చేద్దాం అంటే మాత్రం పారిపోతున్నారట. 
 
గతంలో నాగార్జున, ఐశ్వర్యారాయ్, విక్రమ్, రజినీకాంత్ తదితర మెగా హీరోహీరోయిన్లు మణిరత్నం డేట్స్ కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడది రివర్స్ అయ్యింది. మణిరత్నం చిన్నచిన్న హీరోల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. రావణ్, చెలియా, కడలి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయమయ్యాయి. ఆయన స్టోరీలు సినీ అభిమానులకు ఎక్కడంలేదట. 
 
అర్జున్ రెడ్డి లాంటి ద్వంద్వార్థాలతో వచ్చే సినిమాలను ఆకాశానికెత్తేస్తున్నారు. మరి ఇలాంటి ఫార్ములాతో మణిరత్నం వస్తే చూస్తారేమో.. అదలావుంటే మణిరత్నం నలుగురు హీరోలను పెట్టి ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేయగా ఓ తెలుగు యువ హీరో తొలుత ఓకే చెప్పారట. వీర లెవల్లో మణిరత్నం కథలో మార్పులు చేర్పులు కూడా చేశాడట. తీరా సెట్ పైకి వెళ్లే టైంకి తనకు డేట్స్ ప్రాబ్లమ్ అని మణిరత్నంకు హ్యాండిచ్చేశాడట. ఏం చేస్తాం... అంతా కాల మహిమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments