Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు కారణమిదే... పావని - శ్రవణ్ లవర్సా?

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా తన భార్య సెల్‌ఫోన్‌లోని ప్రొఫైల్ పిక్‌యే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. బుధవారం వేకువజామున ప్రదీప్

Webdunia
గురువారం, 4 మే 2017 (08:59 IST)
బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా తన భార్య సెల్‌ఫోన్‌లోని ప్రొఫైల్ పిక్‌యే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. బుధవారం వేకువజామున ప్రదీప్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
ముఖ్యంగా ప్రదీప్ భార్య పావనీ రెడ్డి తన కజిన్ బ్రదర్ శ్రవణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న పిక్చర్‌కు ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంది. ఇదే భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది.. చివరకు ప్రదీప్ ఆత్మహత్యకు కారణమైంది. మంగళవారం రాత్రి ప్రదీప్ ఇంటిలో బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ బర్త్ డే పార్టీ ప్రదీప్ బావమరిదిది కాదని, అతడు కేవలం ప్రదీప్ భార్య పావని స్నేహితుడేనని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. అతడి పేరు శ్రావణ్ అని, దుబాయ్ నుంచి నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడని, అప్పటి నుంచి ప్రదీప్ ఇంట్లోనే అతడు మకాం వేశాడని చెబుతున్నారు. 
 
శ్రావణ్‌తో చనువుగా ఉన్న ఫొటోను పావని తన మొబైల్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడంతో ప్రదీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడని, గొడవకు అదే అసలు కారణమని అంటున్నారు. ప్రదీప్ సూసైడ్ నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని తాము ఖచ్చితంగా చెప్పగలమని అతడి స్నేహితులు పోలీసులకు వివరణ ఇచ్చారు. శ్రావణ్, పావని కలిసి ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చని ప్రదీప్ స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు.
 
మంగళవారం రాత్రి 1.30 నుంచి ఉదయం 4.30 వరకు భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గొడవ కారణంగా ప్రదీప్ బాటిల్‌తో తల పగలగొట్టుకున్నాడని, గాజు ముక్కలు కనిపించకుండా పనిమనిషిని పిలిపించి పావని క్లీన్ చేయించిందని స్థానికులు చెబతున్నారు. ఆత్మహత్యకు ముందు అద్దం పగలగొట్టగా చేతికి అంటుకున్న రక్తపు మరకలను కూడా పావనియే తుడిచేసిందట. సూసైడ్ నోట్ కనిపించకపోవడం, మృతదేహం మంచం కింద ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి.. ఈ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments