Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్త

Webdunia
గురువారం, 27 జులై 2017 (17:12 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పూణేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కీలకమైన పాటను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ పాటలో మూడు పాత్రల కోసం మాటిమాటికి ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌తో రెడీ కావలసివచ్చింది. అలాగే మూడు పాత్రలకు కలుపుకుని ఈ ఒక్క పాటలోనే 42 రకాల జతల డ్రెస్‌లను వాడినట్టు చెప్తున్నారు. డ్రెస్‌లతో పాటు ఎప్పటికప్పుడు బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను మారుస్తూ ఎన్టీఆర్ ఈ పాట షూటింగ్‌లో పాల్గొన్నాడని.. ఈ పాట ద్వారా నందమూరి ఫ్యాన్స్‌కు యంగ్ టైగర్ మంచి ట్రీట్ ఇస్తారని సినీ యూనిట్ చెప్తోంది. 
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన జై లవ కుశ పాటలు ఆగస్టులో విడుదల కానున్నాయి. రెండో టీజర్ ఆగస్టు 1వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 21వ తేదీన రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments