Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ రాజకీయ పార్టీలోకి తెలుగింటి సీత!

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంలో పదహారణాల తెలుగు ఆడపిల్లగా కనిపించిన హీరోయిన్ అంజలి. ఈమెపై కోలీవుడ్‌లో ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా తెలుగు వెండితెరకు దూరమైన అంజలి... తెలుగు తెరపై అడ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (10:56 IST)
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంలో పదహారణాల తెలుగు ఆడపిల్లగా కనిపించిన హీరోయిన్ అంజలి. ఈమెపై కోలీవుడ్‌లో ఓ రూమర్ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా తెలుగు వెండితెరకు దూరమైన అంజలి... తెలుగు తెరపై అడపా దడపా మాత్రమే కనిపిస్తోంది. 
 
అదేసమయంలో మలయాళం, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఆమె చేసిన 'బెలూన్' సినిమా, త్వరలో విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అంజలి రాజకీయల్లోకి రానుందనే వార్త తమిళనాట షికారు చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడితే అందులో అంజలి చేరే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. 
 
తాజాగా 'బెలూన్' మూవీ ప్రమోషన్లో అంజలి మాట్లాడుతూ... తనకి రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని చెప్పింది. రాజకీయ పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తూ ఫాలో అవుతుంటానని అంది. అంతే.. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి రానుందనే ప్రచారం మొదలైయింది. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని ఆ తర్వాత ఆమె చెప్పినా.. ఈ ప్రచారం మాత్రం ఆగకపోవడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments