బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

ఠాగూర్
సోమవారం, 1 డిశెంబరు 2025 (17:18 IST)
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నాకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ వరించింది. లెజండరీ దర్శకుడు వి.శాంతారాం బయోపిక్‌లో ఆమె నటించనున్నట్టు సమాచారం. భారతీయ సినిమా దిగ్గజాల్లో ఒకరుగా వి.శాంతారాం వెలుగొందారు. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా "చిత్రపతి వి.శాంతారాం" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన "నట సామ్రాట్" చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. వి.శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో  సంధ్య హీరోయిన్‌గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్ ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నారు.
 
ఈ కథ విన్న వెంటనే తమన్నా పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తి చూపి అంగీకరించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఆమె కెరీర్‌లో ఈ పాత్ర మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇందులో వి.శాంతారాం సినీ ప్రస్థానం, ఆయన ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments