శ్రీదేవిని చేసినట్లుగా తనను చేయాలని బోనీకపూర్ వద్దకు వెళ్ళిన తమన్నా..?

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (13:35 IST)
శ్రీదేవి జీవిత చరిత్రలో నటించడం తన డ్రీమ్ అంటోంది తమన్నా. శ్రీదేవి అంటే చెప్పలేనంత ఇష్టమట. మరి శ్రీదేవి బయోపిక్‌లో తమన్నాకు ఛాన్స్ ఇస్తారా. అసలు అతిలోక సుందరి బయోపిక్‌ను ఎవరు తీస్తున్నారు. శ్రీదేవి జీవిత చరిత్రలో నటించాలని ఎప్పటి నుంచో ఉందంటోంది తమన్నా. అతిలోక సుందరి శ్రీదేవి గత యేడాది దుబాయ్‌లో కన్నుమూశారు. ఆమె మరణించిన తరువాత శ్రీదేవి జీవిత చరిత్ర తీయాలని పలువురు దర్శకులు ప్రయత్నించారు. కానీ ఆమె బయోపిక్‌ను తీసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆమె భర్త బోనీకపూర్ చెప్పుకొచ్చారు.
 
అయితే ఎవరు బయోపిక్ తీసినా తనకు మాత్రం అవకాశం ఇవ్వాలని కోరుతోంది తమన్నా. ఈ విషయాన్ని స్వయంగా బోనీకపూర్‌కు కూడా చెప్పిందట. శ్రీదేవి బయోపిక్ ఎప్పుడు తీసినా తనతోనే ప్లాన్ చేయమని కోరిందట. శ్రీదేవి అంటే అంత ఇష్టమని చెబుతోందట. శ్రీదేవి నటించిన హిమ్మత్‌వాలా రీమేక్‌లోను తమన్నానే నటించింది. శ్రీదేవి హిందీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ హిమ్మత్‌వాలా. ఆ సినిమాను మళ్ళీ రీమేక్ చేసినప్పుడు ఆ రోల్‌ను తమన్నా చేసింది.
 
తమన్నా డ్యాన్స్‌ను, ఆమె అందాన్ని తమన్నా రెయిజ్ చేసింది అప్పట్లో. తమన్నా ఇప్పుడు ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ప్రమోషనలో భాగంగా తన మనస్సులోని మాటను బయటపెట్టింది తమన్నా. ఈ యేడాది ఎఫ్‌-2 సినిమాతో భారీ హిట్ అందుకున్న తమన్నా తాజాగా అభినేత్రి-2లో నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments