Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో భారీ ఆఫర్... అంతా విప్పేసినందుకేనా...?

Webdunia
గురువారం, 30 జులై 2015 (17:08 IST)
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం హిందీలో మాత్రమే ఇప్పటివరకు 90 కోట్ల రూపాయలను వసూలు చేసి, 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో 'బాహుబలి' చిత్రంలో నటించిన వారందరూ ఒకొక్కరిగా ఓ రేంజ్‌‌కు వెళ్లిపోతున్నారు. ఆ కోవలో బాహుబలిలో నటించిన తమన్నాకు ఇప్పటికే కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తుండగా, బాలీవుడ్‌ నిర్మాతలు కూడా వెంటపడుతున్నారు. 
 
గత కొంతకాలం క్రితం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తమన్నాకు అప్పట్లో ఎదురుదెబ్బ తగిలింది. తమన్నా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఆఫర్లు కరువై రివ్వున గోడకు కొట్టిన బంతిలా దక్షిణాదికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. 'బాహుబలి'లో తమన్నా, ప్రభాస్ ముందు అలా అంతా విప్పేసినందుకే ఆఫర్లు వస్తున్నాయని సినీ వర్గాల టాక్. అయితే అమ్మడు ఈసారైనా అక్కడ నిలదొక్కుకుంటుందేమో చూడాలి.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments