Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాకు చిరంజీవి బంపర్ ఆఫర్.. ఏంటది?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమాని స‌మ్మ‌ర్‌లో రిలీజ్

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (10:33 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమాని స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ  సినిమా త‌ర్వాత చిరు కొర‌టాల‌తో సినిమా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాని ప్రారంభించాల‌నుకుంటున్నారు.
 
అయితే.. ఈ సినిమాలో చిరు స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. చిరుకి జంట‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకోవాలి అనుకుంటున్నార‌ట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్‌ కళ్యాణ్‌తో కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, రామ్‌ చరణ్‌తో ర‌చ్చ‌, అల్లు అర్జున్‌తో బ‌ద్రీనాధ్ చిత్రాల్లో తమన్నా న‌టించింది.
 
రచ్చ సినిమా రిలీజ్‌ సమయంలో.. తమన్నాతో కలిసి నటించాలని ఉందని చిరు స్టేజ్ మీద చెప్పారు. ప్రస్తుతం తమన్నా సైరాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు చిరుతో పూర్తిస్థాయి చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి.. హోం మంత్రి అనిత ఏమన్నారంటే?

ఆర్జీకర్ వైద్యురాలి హత్య కేసు : ముద్దాయికి ఉరిశిక్ష ఎందుకు విధించలేదు.. కోర్టు వివరణ!

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దే : హరిరామ జోగయ్య.

Monalisa: మహా కుంభ మేళాలో నీలి కళ్ళు చిన్నది.. బ్రౌన్ బ్యూటీ.. వైరల్ గర్ల్ (video)

Greeshma case judgement, ప్రియుడిని గడ్డి మందుతో చంపేసిన ప్రియురాలు: ఉరిశిక్ష విధించిన కేరళ కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments