Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్ ఇంట దీపావళి వేడుకలు.. హాజరైన సన్నీలియోన్.. సాదరంగా ఆహ్వానించిన కిరణ్

పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. చేసే సినిమాలన్నీ అడల్ట్ కంటెంట్ ఆధారంగా ఉన్నవే అయినా.. సన్నీకి ఇక్కడ ఫ్యాన్ బేస్ బాగానే పెరిగిప

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (14:36 IST)
పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ బాలీవుడ్ హీరోయిన్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. చేసే సినిమాలన్నీ అడల్ట్ కంటెంట్ ఆధారంగా ఉన్నవే అయినా.. సన్నీకి ఇక్కడ ఫ్యాన్ బేస్ బాగానే పెరిగిపోయింది. అయితే బాలీవుడ్ టాప్ స్టార్స్ మాత్రం ఇంతకాలం సన్నీని దూరంగానే పెట్టారు. కొంతకాలం క్రితం సన్నీ లియోన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ.. బాలీవుడ్‌లో ఆ స్టేజ్‌ని మార్చేసింది. తన గతాన్ని సమర్ధించుకుంటూ ప్రస్తుతం చేస్తున్న పనిపై సంతోషం వ్యక్తం చేసిన తీరు.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఎంతో పరిణతితో కూడిన జవాబులు.. ఆమెను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాయి. 
 
ఆ సమయంలో బాలీవుడ్‌ ఖాన్‌లతో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టింది సన్నీ. అవకాశం వస్తే సన్నీ లియోన్‌తో తప్పనిసరిగా మూవీ చేస్తానని అమీర్ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అమీర్ కంటే ముందే షారూక్ తన మూవీ 'రాయీస్'లో ఛాన్స్ ఇచ్చేశాడు. ఇప్పుడు అమీర్ మూవీలో కూడా సన్నీలియోన్ అవకాశం దక్కించుకుంది. అమీర్ హీరోగా తెరకెక్కుతున్న దంగల్ చిత్రంలో సన్నీ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. దీంతో ఈ భామ అమీర్‌కు బాగా దగ్గరైందట. రోజు రోజుకు వీరి స్నేహం ముదిరిపోతోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
అంతేకాదు ఈ దీపావళి పండగకు సన్నీ.. అమీర్ ఇంటికి వెళ్లిందట. పండుగ మాత్రేమే కాదండోయ్... అమీర్ చేసే ప్రతి వేడుకకు ఈ భామను పిలుస్తున్నాడట. దీపావళికి సన్నీ ఇంటికి రావడంతో అమీర్ భార్య కిరణ్ రావు కూడా తనతో కూడా బాగా క్లోజ్ గానే మెలిగిందట. దీంతో ఈ భామ అమీర్ భార్య తనను బాగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి సన్నీ, అమీర్‌ని బాగానే పట్టేసిందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం