Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ రష్మిల పెళ్లికి సుధీర్ తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా...?

గతవారం జరిగిన ఓ డాన్స్ రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ రష్మీకి లవ్ ప్రపోజల్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్యా ఏమీ లేదనే వార్తలు వస్తూనే ఉన్నా ఇలాంట

Webdunia
బుధవారం, 30 మే 2018 (16:33 IST)
గతవారం జరిగిన ఓ డాన్స్ రియాలిటీ షోలో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ రష్మీకి లవ్ ప్రపోజల్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్యా ఏమీ లేదనే వార్తలు వస్తూనే ఉన్నా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఉందనే అనుమానం ఎవ్వరికైనా రాక మానదు. 
 
రష్మి తల్లి నుండి పాజిటివ్ సిగ్నల్స్ రావడంతో ఆమె సైడ్ నుండి ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పుకోవాలి. ఇటీవల మదర్స్ డే సందర్భంగా సుధీర్ తన తల్లి చెప్పినట్లే ఈ సంవత్సరం తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే రీసెంట్‌గా సుధీర్ చేసిన ఈ లవ్ ప్రపోజల్‌ను చూసి, కొడుకు సంతోషం కోసం మనస్సు మార్చుకుందట. 
 
సుధీర్ అంతగా ఇష్టపడుతున్నట్లయితే తమ ఇంటి కోడలిగా రష్మిని ఆహ్వానించడానికి తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పిందని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు. వీరు జంటగా మారే శుభసమయం ఎప్పుడొస్తుందో చూడాలి మరి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments