Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ గోడ దూకారు.. కమల్‌ క్రేజ్ ఢమాల్: జూ.ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ వద్దేవద్దు.. శ్రీముఖి కూడా?

తమిళ బిగ్ బాగ్ షోకు మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. తెలుగులో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కార్యక్రమం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తప్పుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్

Webdunia
గురువారం, 13 జులై 2017 (14:50 IST)
తమిళ బిగ్ బాగ్ షోకు మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. తెలుగులో ప్రారంభం కానున్న బిగ్ బాస్ కార్యక్రమం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తప్పుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. తమిళంలో కమల్ హాసన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోపై హిందూ మక్కల్ కట్చి పోలీసులకు ఫిర్యాదు అందించిన సంగతి తెలిసిందే. ఆ షో నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే ముగ్గురు నటులు గోడదూకే ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతో కమల్ హాసన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఇదే తరహాలో ఎన్టీఆర్‌పై విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో నందమూరి వీరాభిమాని అయిన రామకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తెలుగు సంస్కృతిని దిగజార్చే విధంగా ఈ షో నడిచే అవకాశం ఉన్నట్లు అంచనాలుండటంతో ఈ షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకోవాలన్నారు. ఈ షో నుంచి తప్పుకోని పక్షంలో ఎన్టీఆర్ క్రేజ్ పడిపోయే ఛాన్సుందని ఆయ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
కానీ బిగ్ బాస్ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సంజయ్, శిల్పాశెట్టి తరహాలో ఎన్టీఆర్‌కు కూడా బిగ్ బాస్ ద్వారా సూపర్ క్రేజ్ లభిస్తుందని నందమూరి ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇకపోతే.. బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. శ్రీముఖి కూడా ఈ షోలో మెరవనుందని సమాచారం. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు టీవీ షోలలో అదరగొడుతున్న శ్రీముఖి.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనబోతోందని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ప్రధాని మోడీ భద్రతా వలయంలో లేడీ కమాండో...!!

బాలానగర్ సీతాఫలంకు భౌగోళిక గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments