Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్.ఆర్.ఆర్. సినిమాతో జక్కన్నకు కొత్త కష్టాలు..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (17:02 IST)
దర్సకుడు రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్. తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి. తీసిన సినిమాలు తక్కువే అయినా అన్నీ బ్లాస్టింగ్ సినిమాలే. అయితే ప్రస్తుతం జక్కన్నకు ఒక సినిమా వల్ల కొత్త సమస్య వచ్చి పడిందట.
 
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు నుంచి వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒక హీరోయిన్ షూటింగ్ ప్రారంభమైన తరువాత మధ్యలో వెళ్ళిపోవడం.. ఆ తరువాత హీరోకు గాయం కావడం కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోవడం జరుగుతూ వచ్చాయి.
 
ప్రస్తుతం సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి జక్కన్నకు. ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటించడానికి కొంతమంది సైడ్ యాక్టర్లు కావాలంటూ స్వయంగా రాజమౌళి గత కొన్నిరోజుల ముందు ప్రకటన చేశారు.
 
అయితే ఆ ప్రకటన కాస్త కొంతమందికి బాగా డబ్బులు తెచ్చిపెడుతోంది. ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటించాలంటే మమ్మల్ని కలవాలని కొన్ని ప్రైవేటు సంస్థలు కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత బోర్డులు కూడా తిప్పేశారు. దీంతో బాధితులు పోలీస్టేషన్‌కు వెళ్ళి ఆ సంస్థలపై ఫిర్యాదులు చేశారు.
 
ఇది కాస్త రాజమౌళికి ఇబ్బందికరంగా మారింది. షూటింగ్‌లో బిజీగా ఉన్న జక్కన్న దీనిపై స్పందించలేదు. వెంటనే మీరు స్పందించాలని లేకుంటే ఇలాంటి సంస్థలు మరిన్ని పుట్టుకొస్తాయని అభిమానులలు జక్కన్నకు మెసేజ్‌లు చేస్తున్నారట. మరి దీనిపైనైనా రాజమౌళి స్పందిస్తారేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments