Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ పుష్ప సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ఐటమ్ సాంగ్

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (19:44 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఎర్ర చందనం నేపధ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నారు.
 
బన్నీ క్యారెక్టర్ ఇప్పటివరకు చేయని విధంగా.. సరికొత్తగా ఉంటుందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈసినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆర్య, ఆర్య 2, 100 పర్సంట్ లవ్, రంగస్థలం.. ఇలా సుకుమార్ సినిమాలో ఐటం సాంగ్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది.
 
పుష్ప సినిమాలో కూడా ఐటం సాంగ్‌కు ఓ ప్రత్యేకత ఉంటుందట. అయితే.. ఈ సాంగ్‌ను బాలీవుడు బ్యూటీతో చేయిస్తే బాగుంటుందని సుకుమార్ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రధ్ధా కఫూర్ అని సమాచారం.
 
 పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండడం.. ఇది అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో ఈ సాంగ్ గురించి చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి... ఈ బాలీవుడ్ బ్యూటీ బన్నీ మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments