Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏడు తరాలా.. వెతికితే దొరకనంత మందా..! కలిస్తే వదులుకోలేనంత మందా..!'.. సితారపై సమంత ట్వీట్

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతల గారాలపట్టి సితార పోటీ లేకుండా గెలిచేసిందని కుందనపు బొమ్మ సమంత అంటోంది. మహేష్‌బాబు, సమంత జంటగా నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత చెప్పిన డైలాగును సితార చె

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (09:00 IST)
టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతల గారాలపట్టి సితార పోటీ లేకుండా గెలిచేసిందని కుందనపు బొమ్మ సమంత అంటోంది. మహేష్‌బాబు, సమంత జంటగా నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత చెప్పిన డైలాగును సితార చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ డైలాగుతో పాటు సితారకు సంబంధించిన పలు వీడియోలను మహేష్ అభిమానులు కామెంట్లు, షేర్లతో హోరెత్తించారు. 
 
ఈ క్రమంలో ఈ సినిమాలో సమంత చెప్పిన 'ఏడు తరాలా.. వెతికితే దొరకనంత మందా..! కలిస్తే వదులుకోలేనంత మందా..!' అనే డైలాగ్‌ను సితార ముద్దు ముద్దుగా చెప్పింది. సమంత చెప్పిన డైలాగును తన ముద్దుముద్దు మాటలతో - క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో చక్కగా చెప్పింది సితార. ఈ వీడియోను నమ్రతా ట్విట్టర్ ద్వారా సమంతకు షేర్ చేసింది. ఈ వీడియో చూసిన మహేష్ అభిమానులు కూడా లైకులు కొట్టకుండా ఎలా ఉంటారు చెప్పండీ! ఇక కామెంట్లూ షేర్లు... చెప్పాల్సిన పనే లేదు. 
 
ఈ వీడియోను ఓ అభిమాని తయారు చేసి పెట్టగా, అదే వీడియోకు తను చెప్పిన వీడియోను జత చేసిన సమంత ట్వీట్ చేస్తూ... 'పోటీ లేకుండా తనే గెలిచింది' అంటూ కామెంట్‌ పెట్టింది. కాగా, సితార తన బెస్ట్ ఫ్రెండ్ అని సమంత గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆడియో వేడుకలో కూడా సమంత ఒళ్లో కూర్చుని, ఆమెతో కబుర్లు చెబుతూ సితార సందడి చేసిన సంగతి అందరికి తెలిసిందే. సితార చెప్పిన డైలాగులతోపాటు... ఆ డైలాగులు చెబుతున్నప్పుడు పెడుతున్న ఫేస్ ఫీలింగ్స్ మరీ ముద్దొచ్చేలా ఉన్నాయి. 
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments