Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా ఛాన్స్ లేకపోవడంతో భర్తను విలన్‌గా చూపిస్తున్న టాలీవుడ్ టాప్ నటి...

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథనాయికగా ఓ వెలుగు వెలిగిన భామ సిమ్రాన్. టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌.. ఇలా టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (09:11 IST)
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథనాయికగా ఓ వెలుగు వెలిగిన భామ సిమ్రాన్. టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌.. ఇలా టాలీవుడ్‌ అగ్రహీరోలందరితోనూ సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన సిమ్రాన్‌, తెలుగులో నెంబర్‌‌వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తమిళ, తెలుగు సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌ అన్పించుకుందీ కూడా. 
 
ఈ భామ 2003లో పెళ్లైన తర్వాత సిని పరిశ్రమకు కాస్త దూరంగా ఉన్న తిరిగి మళ్లీ మేకప్ వేసుకుంది. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ఓ తమిళ చిత్రంలో నటించి మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ సుందరి మరో తమిళ, తెలుగు చిత్రంలోనూ నటిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా హీరోయిన్ పాత్రనే పోషించడానికి సిద్దమవుతుంది. 
 
ఈ చిత్రానికి తన భర్త నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో రాణీముఖర్జీ నటించిన 'మర్దానీ' సినిమా తరహాలో పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుందట. ఈ చిత్రంలో సిమ్రాన్ డబుల్‌ రోల్‌లో అలరించనుంది. ఇదిలావుంటే తన భర్తను హీరోగా పరిచయం చేయాలన్న కోరిక ఫలించలేదు. ఇతర ప్రముఖ కథానాయకుల చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినా అవీ జరగలేదు. ఇలా హీరో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పుణ్యకాలం గడిచి పోతుందని భావించిందేమో తెలియదు కానీ, ఇప్పుడు తన భర్త దీపక్‌ను విలన్‌గా మార్చేశారు.
 
''ఓడు రాజా ఓడు'' చిత్రంలో దీపక్ విలన్‌గా నటిస్తున్నారు. జోకర్ గురు సోమసుందర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నాజర్, చారుహాసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నిశాంత్ రవీంద్రన్, జతిన్ శకర్‌రాజా ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి వినోద భరిత కథా చిత్రం అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి సిమ్రాన్ కూడా తన భర్తను రంగంలోకి దించేసిందని సినీ నిపుణులు అంటున్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments