Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అంత పని చేశాడా...? పరువు పోయిందా..? ఏం జరిగింది...?

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరువు పోయిందా...? ప్రతి సంవత్సరం జరిగే సైమా అవార్డు వేడుకలకు ఈసారి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోలకు ఈ అవార్డుల్లో ఉత్తమ హీరోగా ఎంట్రీ దక్కింది. ఇక సైమా నిర్వాహకులు ఉత్తమ నటుడి ఎంపిక

Webdunia
మంగళవారం, 31 మే 2016 (14:29 IST)
మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరువు పోయిందా...? ప్రతి సంవత్సరం జరిగే సైమా అవార్డు వేడుకలకు ఈసారి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోలకు ఈ అవార్డుల్లో ఉత్తమ హీరోగా ఎంట్రీ దక్కింది. ఇక సైమా నిర్వాహకులు ఉత్తమ నటుడి ఎంపికను ప్రేక్షకులకు వదిలేశారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఉత్తమ హీరో అయ్యే అవకాశం ఉంటుంది. మహేష్‌ బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’, ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రాలతో ముందు వరుసలో ఉన్నారు. 
 
అయితే అనూహ్యంగా ఒకే రోజు 30 వేలకు పైగా ఓట్లు రావడంతో అల్లు అర్జున్‌ అందరు హీరోలను దాటేసి ముందుకు వెళ్లాడు. సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్‌ నటనకు ఉత్తమ హీరో అవార్డు ఇవ్వాలంటూ ఓట్లు భారీగా వచ్చాయి. ఒక్కసారిగా 30 వేల ఓట్లు రావడంతో షాక్‌ అయిన నిర్వాహకులు వచ్చిన ఓట్లను పరిశీలించారు. దాంతో ఆ మొత్తం ఓట్లలో 27 వేల ఓట్లు దొంగ ఓట్లు అంటూ తేలింది. 
 
దాంతో నిర్వాహకులు ఆ ఓట్లను తొలగించారు. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్‌ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు. అవార్డు కోసం అల్లు అర్జున్‌ తన వారితో సైమా సైట్‌ను హ్యాక్‌ చేయించి ఆ ఓట్లు పడేలా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఇప్పటి వరకు సైమా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని తోసిపుచ్చుతున్నారు. కాని విమర్శకులు మాత్రం అల్లు అర్జున్‌ అవార్డు కోసం కక్కుర్తి పని చేశాడని విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ అంత పని చేసి ఉంటారా...? అబ్బే... అలా ఏమీ చేయడని అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments