Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వెధవలు... దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడాలి : శృతిహాసన్

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:38 IST)
ఇతరుల గురించి గాసిప్స్ రాసే వెధవలు... దమ్ముంటే వారు రాసే గాసిప్స్‌నే నా ముందుకు వచ్చి మాట్లాడాలని హీరోయిన్ శృతిహాసన్ అంటోంది.  ప్రస్తుతం 'ప్రేమమ్‌' తెలుగు రీమేక్‌తోపాటు తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్.. తనపై వస్తున్న గాసిప్స్‌పై సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించింది. 
 
"ప్రతి రోజు ఉదయం పేపర్‌ చూడడానికి ముందు నా గురించి గాసిప్స్‌ ఉండకూడదని కోరుకుంటాను. ఒకవేళ ఉంటే చూసి నవ్వుకుంటాను. ఇతరులపై వచ్చే గాసిప్స్‌ గురించి అస్సలు పట్టించుకోను. కనీసం ఆ వార్త చదవడానికి కూడా ట్రై చెయ్యను. నా గురించి లేకపోతే సంతోషంగా తర్వాతి పనిలోకి వెళ్లిపోతాను" అని చెప్పుకొచ్చింది. 
 
అంతేనా, "గాసిప్స్‌తోపాటు నాకు నవ్వు తెచ్చే ఇంకో విషయం ఉంది. అదే ట్విట్టర్‌. ఎవరో ముక్కు, మొహం తెలియనివారు కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్విట్టర్‌లో ఇష్టమొచ్చిన రాతలు రాస్తుంటారు. వాటిని చదివి చాలా నవ్వుకుంటాను. ఆ రాతలు రాసేవారు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. అలాంటి వారిని ఓసారి కలవాలనిపిస్తుంటుంది" అని పేర్కొంది. 

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

సిగ్నల్ జంప్ చేసి ఎక్స్‌ప్రెస్ రైలను ఢీకొన్న గూడ్సు రైలు.. 15కి పెరిగిన మృతులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన... త్వరలో ప్రారంభం

19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్

లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

Show comments