Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ, ధృవ సినిమాలకు పెద్ద నోట్ల ఫీవర్.. ధృవ సినిమా సంక్రాంతికి, సమ్మర్లో ఖైదీ నెంబర్ 150?

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న మూవీ 'ఖైదీ నెంబర్ 150' సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. స్లోవేనియా, క్రోయేషియా దేశాల్లో జరుగుతోంద

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (14:25 IST)
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న మూవీ 'ఖైదీ నెంబర్ 150' సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. స్లోవేనియా, క్రోయేషియా దేశాల్లో జరుగుతోంది. షూటింగ్‌కి సంబంధించిన కొన్ని పిక్స్‌ని కాస్టూమ్స్‌ డిజైనర్‌, చిరు కూతురు సుష్మిత అభిమానులతో షేర్ చేసింది. అక్కడ నేచర్ బాగుందని, షూట్‌ చేయడానికి ఇంతకన్నా మంచి లొకేషన్ దొరకడం కష్టమంటూ ట్వీట్ చేసింది. 
 
ఖైదీ షూటింగ్ పనులు దాదాపుగా ముగిశాయని.. కొంత వర్కే పెండింగ్ ఉందని.. హైదరాబాదులో ఈ పనిని ముగించేందుకు రంగం సిద్ధం అవుతుంది. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టుని డిసెంబర్ 15 నాటికి అంతా పూర్తి చేసి, ఆ తర్వాత ప్రమోషన్‌లో బిజీ కావాలని మేకర్స్ భావిస్తున్నారు. 
 
అయితే చిరంజీవి ఖైదీకి చెర్రీ ధ్రువకి పెద్ద నోట్ల ఫీవర్ తప్పేలా లేదు. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధృవ' మూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో ''ధృవ'' మూవీ విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ధృవ మూవీ వాయిదా ఎఫెక్ట్ చిరంజీవి 150వ సినిమాపై కూడా పడబోతోంది.
 
ధృవ మూవీని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడం కాకుండా సంక్రాంతి రేసులో నిలుపాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అప్పటి వరకు జనం చేతిలో డబ్బు సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ధృవ, చిరు 150 మూవీ ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేస్తే కలెక్షన్ల మీద దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి.. చిరు 150వ మూవీని రిలీజ్ ను సంక్రాంతి బరి నుండి తప్పిస్తే సమ్మర్లో విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments