Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దేవుడే దిగివచ్చినా'.. పవన్ కళ్యాణ్ - సమంత కలిసి మరొక్కసారి.. త్రివిక్రమ్ ఏంటున్నారు?

పవన్‌ కల్యాణ్‌ - సమంత కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. వీళ్లిద్దరూ కలసి నటించిన ‘అత్తారింటికి దారేది’ రూ.వంద కోట్ల క్లబ్‌లో సినిమాగా నిలిచింది. అప్పటి నుంచి పవన్‌ - సమంతలని మళ్లీ కలసి కట్టుగా చూసే అవక

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (14:47 IST)
పవన్‌ కల్యాణ్‌ - సమంత కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. వీళ్లిద్దరూ కలసి నటించిన ‘అత్తారింటికి దారేది’ రూ.వంద కోట్ల క్లబ్‌లో సినిమాగా నిలిచింది. అప్పటి నుంచి పవన్‌ - సమంతలని మళ్లీ కలసి కట్టుగా చూసే అవకాశం కలగలేదు. ఆన్ స్క్రీన్ పై ఈ జంట‌ పండించిన రొమాన్స్ బాగానే వ‌ర్కౌట్ అయింది. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేయాల‌ని త్రివిక్రమ్ భావిస్తున్నాడ‌ట‌. 
 
ఇప్పటికే త్రివిక్రమ్‌కు ప‌వ‌న్ కాల్షీట్లు ఇచ్చేశాడు. హాసిని అండ్ హారిక బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మాణం కానుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..'అత్తారింటికి దారేది'కి సీక్వెల్. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తోందని, ఆ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వచ్చిన వార్తలను హీరోయిన్ సమంత కొట్టిపారేసింది. ఆ వార్తలు నిజం కాదని ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. 
 
త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై 'అత్తారింటికి దారేది' సినిమాకు సీక్వెల్ వస్తోందని... ఆ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ ఖరారు చేశారని... డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని హీరోగా పవన్ కల్యాణ్, హీరోయిన్‌గా సమంత నటిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే, ఆ వార్తలు నిజం కాదంటూ సమంత ట్వీట్ చేసింది. అయితే, సీక్వెల్ రావడం నిజం కాదా? లేక సీక్వెల్‌లో హీరోయిన్‌గా తాను నటించడం లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments