Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ని రోజులు ఇలా ఉండాలి.. పెళ్లితో ఒక్కటవుదాం.. సమంతతో చైతూ ఫస్ట్ ప్రపోజల్

అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. అయితే, ఈ విషయం బయటకు పొక్కడానికి, పెళ్లి ఫైనల్ కావడానికి ప్రధాన కారణం సమంతనే అని చెప్పుకోవాలి. దాదాపు రెండు, మూడు నెలలు

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (13:59 IST)
అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. అయితే, ఈ విషయం బయటకు పొక్కడానికి, పెళ్లి ఫైనల్ కావడానికి ప్రధాన కారణం సమంతనే అని చెప్పుకోవాలి. దాదాపు రెండు, మూడు నెలలుగా మీడియా ముందు, సోషల్ మీడియాలో సమంత తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ, తన ప్రియుడు ఎవరో కాదని, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి అంటూ హింట్‌లు ఇవ్వడంతో ఈ హంగామా చివరకు పెళ్లి వరకు వచ్చింది.
 
ఇదిలావుంటే... హీరో నాగ చైతన్య తాజాగా పెళ్లి విషయంలోనూ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదే తానొక ఇంటివాడు కాబోతున్నట్టు చెప్పాడు. ఈ మేరకు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ సమంతతో తన ప్రేమాయణం గురించి చెప్పాడు. తాము ప్రేమలో ఉన్న విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసన్నాడు. ''ఏమాయ చేసావె'' సినిమా చేస్తున్నప్పుడే సమంతతో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయామని... స్నేహం కాస్త ఇష్టంగా మారిందని... తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని అన్నాడు. 
 
ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే...ఇప్పటి వరకు ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదని చెప్పాడు. తనకు 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని.. అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయి గుర్తుకు రాలేదని చెప్పాడు. ఓరోజు సమంత వద్దకు వెళ్లి.. "ఎన్ని రోజులు ఇలా బాయ్‌‌ఫ్రెండ్, గర్ల్‌‌ఫ్రెండ్‌గా ఉంటాం. పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది" అని చెప్పాడట. పెళ్లి వద్దనుకుంటే మాత్రం ఇక్కడితో ఆపేద్దామని చెప్పానని.. అప్పుడే తన ఇష్టాన్ని సమంత వ్యక్తం చేసిందని.. ఆ క్షణమే తామ పెళ్లితో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని'' తన ప్రేమ కథని చెప్పుకొచ్చాడు చైతన్య.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments