Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కంటే.. ముందే చైతూ-సమ్మూ పెళ్లి.. పెళ్ళికి తర్వాత నటిస్తా.. 2017 కొంచెం కష్టమే

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సుందరి సమంత.. తనకు కెరీర్ పరంగా 2017 కొంచెం కష్టమైన సంవత్సరమని తెలిపింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసిన ఈ ఏడాది 5,6 సినిమాలు చేస్తున్నట్

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (17:19 IST)
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సుందరి సమంత.. తనకు కెరీర్ పరంగా 2017 కొంచెం కష్టమైన సంవత్సరమని తెలిపింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసిన ఈ ఏడాది 5,6 సినిమాలు  చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు 2016 లో తనకిష్టమైన మూవీ దంగల్ అని చెప్పింది.

ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది మేలో అక్కినేని వారింట పెళ్లి భజంత్రీలు మోగబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం, జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌తో జరగబోతోంది. ఇప్పటికే ఇద్దరిళ్లలోనూ పెళ్లి పనులను కూడా ప్రారంభమయ్యాయి. 
 
అఖిల్ పెళ్లి తర్వాతే సమంత, చైతూ పెళ్లి అనుకున్నారు. అఖిల్ పెళ్లి కంటే ముందు.. చైతూ, సమంతల పెళ్లి చేయాలని అక్కినేని కుటుంబీకులు అనుకుంటున్నారట. దానికి తగినట్టే నాగచైతన్య పెళ్లికి పనులు చేస్తున్నారంటూ నెటిజన్లు చెప్పుకొంటున్నారు. జనవరి 29న వాళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిపోతుందని, ఆ తర్వాత మే కన్నా ముందే వారు పెళ్లి చేసుకుంటారన్న వార్త హల్ చల్ చేస్తోంది. 
 
ఫిబ్రవరి, మార్చి నెలలో మంచి ముహూర్తాల కోసం అక్కినేని ఫ్యామిలీ చూస్తోందని అనుకుంటున్నారు. అంతేగాకుండా రెండు సార్లు సమంతను చైతన్య పెళ్లి చేసుకుంటాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలుత క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటాడని చర్చించుకుంటున్నారు. మరి ఇంతలో ఎంత నిజముందో...
అన్నీ చూడండి

తాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments