Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతగా మారిన సమంత

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (09:59 IST)
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ అని చెప్పాలి. ఈ జాబితాలో చెన్నై సోయగం సమంత అగ్రస్థానంలో ఉంది. ఏ మాయ చేశావే సినిమాతో కుర్రకారులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సామ్.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. 
 
ఆయా భాషల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సామ్ ఇప్పుడు ప్రొఫెషనల్‌గా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు వెండితెరపై మెరిసిన సామ్.. ఇప్పుడు తనలోని నిర్మాతను అందరికీ పరిచయం చేసేందుకు సిద్ధమైంది. 
 
సామ్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఒక హోమ్ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. "నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. సామాజిక సమస్యలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించి, ప్రోత్సహించే వేదిక ఇది..." అంటూ చెప్పుకొచ్చారు. 
 
ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ కొత్త తరం ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కంటెంట్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సామ్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు చెన్నై స్టోరీస్ అనే అమెరికన్ సినిమాలోనూ నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments