Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మనయ్యాక సినిమాలకు రిటైర్మెంట్ తీసుకుంటా.. సమంత (video)

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:45 IST)
అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని.. తన భర్త నాగచైతన్యనే తన ప్రపంచ అని ఓ బేబీ సమంత వెల్లడించింది. అంతేగాకుండా ఇంతకాలం దాచిపెట్టిన ఓ రహస్యాన్ని సమంత బయటపెట్టింది. ఓ బేబీ థ్యాంక్స్ మీట్లో సమంత తెలుగు రంగు దుస్తుల్లో హంసలా మెరిసిపోయింది. ఈ సందర్భంగా ఫోటో షూట్‌లో పాల్గొన్న సామ్ తన శరీరంపై ఉన్న సీక్రెట్ టాటూని బయట పెట్టేసింది. 
 
తన భర్త అక్కినేని నాగచైతన్య పేరును సామ్ తన శరీరంపై కుడి వైపు పక్కటెముకల వద్ద టాటూగా వేయించుకుంది. ఫోటో షూట్‌లో భాగంగా సామ్ తన టాటూని బయట పెట్టింది. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు లైక్స్, షేర్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇకపోతే.. ఓ బేబీ సక్సెస్ తర్వాత సక్సెస్ కావడంతో సమంత కోసం మరిన్ని కథలు సిద్ధం చేస్తున్నారు దర్శకులు. కానీ స్యామ్ మాత్రం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈమె 96 రీమేక్‌కు కమిటైంది కూడా. శర్వానంద్‌తో ఇందులో జోడీ కట్టింది సమంత.
 
ఇక అమ్మ ఎప్పుడు అవుతార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది స‌మంత‌. త‌న‌కు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ఉంద‌ని.. త‌ల్లి కావాల‌ని ఉంద‌ని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే దానికి స‌మయం మాత్రం ఇప్పుడు కాద‌ని.. ఇంకొంచెం టైమ్ ఉంద‌ని చెప్పింది స‌మంత‌. త‌ల్లి అయిన త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని సమంత కామెంట్స్ చేసింది.
 
ఓ బేబీ సినిమా సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటుంది సమంత.. ఈ షూటింగ్ జరుగుతున్నపుడే ఓ బేబీ లాంటి సినిమా చేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలి.. ఎలాంటి సినిమా చేయాలనే కన్ఫ్యూజన్ తనలో మొదలైపోయిందని సమంత వెల్లడించింది. ఈ క్రమంలోనే దర్శకురాలు నందిని రెడ్డితో తాను రిటైర్మెంట్ తీసుకోవాలేమో అనే చర్చ కూడా జరిపినట్లు సమంత చెప్పుకొచ్చినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments