Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి సమంత మతమే కాదు.. పేరు కూడా మారిపోయింది.. ఏమని పిలుస్తున్నారంటే...

సమంత మతం మారిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య అక్కినేని ఇంట జరిగిన ఓ ప్రత్యేక పూజా కార్యక్రమంలో.. సమంతతో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించారు. సమంతను హిందువుగా మార్చేశారు. అయితే సమంత మతం మారడంపై స

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (14:03 IST)
సమంత మతం మారిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య అక్కినేని ఇంట జరిగిన ఓ ప్రత్యేక పూజా కార్యక్రమంలో.. సమంతతో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించారు. సమంతను హిందువుగా మార్చేశారు. అయితే సమంత మతం మారడంపై సమంత కుటుంబసభ్యులు గుస్సా అవుతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.

దీంతో స‌మంత క‌థ ఇప్పుడు అచ్చం సినిమా స్టోరీని త‌ల‌పిస్తోంది…. అమ్మానాన్న వ‌ద్దంటున్నారు… మ‌తం మార‌ద్దంటున్నారు… క‌ట్టుకోబోయేవాడితే ఏడ‌డుగులు న‌డిచి మూడు ముళ్లు వేయించుకోవాలంటే మ‌తం మారిపోవాల్సిందే… అక్కినేని ఇంట్లో కోడ‌లిగా అడుగుపెట్టాలంటే వాళ్ల హిందూ సంప్ర‌దాయాల‌ను అనుస‌రించాల్సిందే… ఇలా ఇప్పుడు స‌మంత స‌త‌మ‌త‌మై పోతోందిట‌. 
 
మతం మారడమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా సమంత పేరు కూడా మారిపోవడం సంచలనంగా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం సమంత ఇప్పుడు చిన్న మేడమ్ అయిపోయింది. అన్నపూర్ణ స్టుడియోలో స్టాఫ్‌తో పాటు… నాగార్జున ఇంట్లో పనివాళ్లు, స్టాఫ్ కూడా ఇలానే పిలుస్తున్నారు సమంతను. కుందనపు బొమ్మను చిన్న మేడమ్ అనే అంటున్నారు. ఈ కొత్త పిలుపు ఏదో బాగున్నట్టుందని సమంత కూడా ఓకే చెప్పేసిందట. ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో పెద్ద మేడమ్ అంటే అమల, చిన్న మేడమ్ అంటే సమంత. 
 
అక్కినేని అంద‌గాడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి స‌మంత త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. స‌మంత‌కు రెండుసార్లు పెళ్లి జ‌రుగుతుంద‌ని మొద‌ట క్రిస్టియ‌న్ ప‌ద్ధ‌తిలో జ‌రిగి ఆ త‌ర్వాత హిందూ సంప్ర‌దాయంలో జ‌రుగుతుంద‌ని మొద‌ట చెప్పారు. ఆ త‌ర్వాత స‌మంత మ‌తం మారడంతో ఒక్క‌సారే హిందూ సంప్ర‌దాయంలో వివాహం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments