Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సుల్తాన్' మేనియాతో కాసుల వర్షం.. ఐదు రోజుల్లో రూ.344 కోట్ల వసూళ్లు!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'సుల్తాన్' చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా ఎక్కడ చూసినా సల్మాన్ మేనియానే కనిపిస్తుంది. ఈ సినిమాలో సల్లూభాయ్ సరసన అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది

Webdunia
బుధవారం, 13 జులై 2016 (09:16 IST)
బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'సుల్తాన్' చిత్రం రికార్డుల మోత మోగిస్తుంది. దేశ‌వ్యాప్తంగా ఎక్కడ చూసినా సల్మాన్ మేనియానే కనిపిస్తుంది. ఈ సినిమాలో సల్లూభాయ్ సరసన అనుష్క శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో అనుష్క శర్మ ఓ రెజ్లర్ పాత్రను పోషించింది. సల్మాన్ ఖాన్ సినిమాలు ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఆడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 
 
ఇప్పటివరకు తొలిరోజు అంటే బుధవారం ఓవర్‌సీస్‌లో 92 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. భారత్‌లోనే ఐదు రోజులకు 252.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ.344.5 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్లు సినీపండితులు అంటున్నారు. ఈ సినిమా దుబాయ్, పాకిస్థాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి చాలా దేశాల్లో ఇప్పటివరకు ఏ హిందీ సినిమాకూ రానంత స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో జంగిల్ బుక్ (183.94), ఎయిర్‌లిఫ్ట్ (127.8) పూర్తి వసూళ్ళను సల్లూభాయ్ చిత్రం వారం రోజుల్లోనే కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments