ప్రభాస్ సరసన సల్మానా లేక సల్మాన్ సరసన ప్రభాసా.. ఇద్దరితో మల్టీస్టారర్ అట

బాలీవుడ్‌లో గ్లామర్‌, యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తాజాగా ఒక మల్టీస్టారర్ సినిమా ప్లానింగులో ఉందన్నవార్త ముంబయ్ సినీ రంగంలో షికారు చేస్తూ సంచలనం కలిగిస్తోంది. ఆ సంచలనానికి కారణం ఆ మల్టీస్టార్ ఫిలింలో క

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (04:32 IST)
బాలీవుడ్‌లో గ్లామర్‌, యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తాజాగా ఒక మల్టీస్టారర్ సినిమా ప్లానింగులో ఉందన్నవార్త ముంబయ్ సినీ రంగంలో షికారు చేస్తూ సంచలనం కలిగిస్తోంది. ఆ సంచలనానికి కారణం ఆ మల్టీస్టార్ ఫిలింలో కధానాయకులే మరి. వాళ్లెవరో కాదు మన ప్రభాస్ అండ్ సల్మాన్ ఖాన్.

 
భారీ మల్టీస్టారర్స్‌ తీయడంలో రోహిత్‌ శెట్టి స్పెషలిస్ట్‌. షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ తీసిన ‘దిల్‌ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు గానీ.. అతడి దర్శకత్వంలో వచ్చిన  ‘బోల్‌ బచ్చన్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘గోల్‌మాల్‌’ సిరీస్‌ నిర్మాతలకు లాభాలు తెచ్చాయి.  రోహిత్‌ ట్రాక్‌ రికార్డు చూస్తే... ప్రభాస్, సల్మాన్‌లు సినిమా చేయొచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. 
 
కాగా, ప్రేక్షకులను ఎవరూ ఫూల్స్‌ చేయలేరు! కథ లేకుండా గ్లామర్, గాల్లో ఎగిరే ఖరీదైన కార్లు, మోడ్రన్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఫూల్స్‌ చేయలేమంటున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఈ స్టేట్మెంట్‌లో స్పెషల్‌గా ఎవరి పేరూ లేకున్నా... షారూక్‌ ఖాన్‌ ‘దిల్‌ వాలే’పై సల్మాన్‌ సెటైర్స్‌ వేశాడని ముంబయ్‌ జనాలు చెప్పుకుంటున్నారు. దర్శకుడు రోహిత్‌ శెట్టి తీసిన ‘దిల్‌ వాలే’ ఆశించినంత హిట్టవ్వలేదు. అందులో సల్మాన్‌ సెటైర్స్‌ వేసినవన్నీ ఉన్నాయి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్‌కు డబుల్ షాక్.. బీజేపీలోకి రాఘవ్ చద్దా... అశోక్ మిట్టల్ జంప్

ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఎందుకో తెలుసా?

బెంగాల్ - తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం రాదు : ఫరూక్ అబ్దుల్లా

నైటీ వేసుకుంటోందని భార్యకు నిప్పు పెట్టిన భర్త

ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు

ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments