Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూల్ మారుస్తున్న న‌య‌న‌తార‌!

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:41 IST)
Nayantara
హీరోయిన్ న‌య‌న‌తార త‌న‌కంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని సినిమా చేశాక ప‌బ్లిసిటీకి దూరంగా వుంటుంది. ఎంత పెద్ద హీరో అయినా స‌రే మా రూల్ అంటే రూలే. తెలుగులో కూడా చాలా మంది నిర్మాత‌లు ఆమె చేసిన సినిమాల విష‌యంలో ముందుగానే అగ్రిమెంట్ ప్ర‌కారం ప్ర‌చారం చేయ‌న‌ని అగ్రిమెంట్‌లో రాసాక అంగీకారంతోనే సినిమా చేసేది. కానీ ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేస్తుందా! అనే అనుమానం కోలీవుడ్‌లో నెల‌కొంది. దానికి కార‌ణం త‌న భ‌ర్త ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలో ఆమె న‌టించ‌డ‌మే.
 
ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌తో త‌మిలంలో కాథువాకుళ రెండు కాదల్ రూపొందింది.  విఘ్నేష్ శివన్ రచన, దర్శకత్వంలో రూపొందింది.  రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది.  ఉదయనిధి స్టాలిన్ తన బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్‌పై పంపిణీ చేసారు. ఇందులో హీరో విజ‌య్ సేతుప‌తి. మ‌రో నాయిక స‌మంత‌. ఇటీవ‌లే తెలుగులో కూడా విడుద‌ల‌చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 28న సినిమా విడుద‌ల కాబోతోంది.  
 
అయితే సినిమా ప్ర‌మోష‌న్‌కు న‌య‌న‌తార వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. త‌ను కూడా నిర్మాతే కాబ‌ట్టి ఆమె వ‌స్తేనే సినిమా ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. సోమ‌వారం నుంచి ప‌బ్లిసిటీ ప్రారంభించ‌నున్నారు. ఇందుకు విజ‌య్‌సేతుప‌తి, స‌మంత సిద్ధంగా వున్నారు. మ‌రి న‌య‌న‌తార మ‌న‌సులో ఏమివుందో ఇంకా వెల్ల‌డించ‌లేదు.
 
కానీ, స‌మంత‌తోపాటు న‌య‌న‌తార కూడా ప్ర‌మోష‌న్ కోసం రాబోతున్నద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ వ‌స్తే, ప్ర‌భుదేవా, శింబువంటివారితో వున్న వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా ఎవ‌రో  ఒక‌రు అడిగే ఛాన్స్ వుంద‌ని, ముందుగానే కేవ‌లం సినిమా కోస‌మే అంటూ చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక స‌మంత కూడా నాగ‌చైత‌న్య‌కు దూరంగా వుంది. ఆ త‌ర్వాత‌ మీడియా ముందుకు రాలేదు. సో. ఏమి జ‌రుగుతుందో కొద్ది రోజుల్లోల తెలియ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments