రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదే..? ఏమైంది..? అమెరికాకు ఎందుకెళ్లిపోయింది?
లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదు. ప్రభాస్‌తో కొరటాల శివ తీసిన మిర్చి, మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు రిచా గంగోపాధ్యాయ్‌కి సక్సెస్ ఇచ్చాయి. తెలుగులోనే కాకుం
లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రిచా గంగోపాధ్యాయ జాడ కనిపించట్లేదు. ప్రభాస్‌తో కొరటాల శివ తీసిన మిర్చి, మాస్ మహారాజ రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు రిచా గంగోపాధ్యాయ్‌కి సక్సెస్ ఇచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో ధనుష్, శింబు లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసింది.
కానీ హీరోయిన్‌గా ఆఫర్స్ వస్తున్నా కూడా వాటిని కాదనుకొని రిచా అమెరికా వెళ్ళిపోయింది. కింగ్ నాగార్జునతో చేసిన 'భాయ్' మూవీ రిచా లాస్ట్ మూవీ. అలా సిల్వర్ స్క్రీన్‌కి దూరమైన మిర్చి బ్యూటీ రిచా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా వుంటోంది. సినిమాలకు దూరంగా ఉన్న విషయంపై సోషల్ మీడియాలో రిచా గంగోపాధ్యాయ స్పందించింది.
అసలు సినిమాలని తాను వృత్తిగా తీసుకోలేదని, క్యాజువల్‌గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని క్లారిటీ ఇచ్చింది. సినిమా అంటే సీరియస్‌గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్‌గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వచ్చేసానని చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో మూవీ మేకింగ్ కోర్స్ చేస్తున్నానని.. మళ్ళీ హీరోయిన్‌గా చేయాలనే ఆసక్తి వస్తే తెలుగులోనే చేస్తానని చెబుతోంది. మరి అప్పటికీ రిచాకు హీరోయిన్ ఆఫర్లు వస్తాయో లేదో వేచి చూడాలి.