Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్.. రీ ఎంట్రీ అదిరిపోతుందా?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మాజీ సతీమణి, నటి రేణు దేశాయ్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. పింక్ రీమేక్ ద్వారా పవవ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు దేశాయ్ కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ చేసుకుంటారు. బద్రి, జానీ చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట పెళ్లై, ఆపై విడిపోయిన తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. 
 
కాగా.. పవన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రేణుదేశాయ్.. ఆయన నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలకు చేరువైంది. ముఖ్యంగా దర్శకురాలిగా.. రచయితగా సత్తా చూపించింది. ప్రస్తుతం వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సై అంటోంది. 
 
ఈ మధ్యే విడుదలైన 'చూసి చూడంగానే' చిత్రంలో హీరో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్య వల్ల చేయలేకపోయానని చెప్పింది రేణు దేశాయ్. అయితే పింక్ రీమేక్‌లో చిన్న పాత్రకైనా తాను చేసేందుకు సిద్ధంగా వున్నట్లు రేణు దర్శకుడితో చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అందుకే దర్శకుడు సంప్రదించిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments