Webdunia - Bharat's app for daily news and videos

Install App

1945 కాలంనాటి లవ్ స్టోరీలో రెజీనాతో రానా రొమాన్స్.. ఆమే కావాలని పట్టుబట్టాడట!

త‌మిళ ద‌ర్శ‌కుడు స‌త్య శివ కాంబోలో రానా ఒక సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఓ చారిత్రాత్మ‌క క‌థ‌ని దగ్గుబాటి రానా కోసం సిద్ధం చేశాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఆ క‌థ‌లో న‌టించేందుకు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (09:27 IST)
త‌మిళ ద‌ర్శ‌కుడు స‌త్య శివ కాంబోలో రానా ఒక సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఓ చారిత్రాత్మ‌క క‌థ‌ని దగ్గుబాటి రానా కోసం సిద్ధం చేశాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఆ క‌థ‌లో న‌టించేందుకు రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం రానా ''బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రానా - స‌త్య శివ సినిమాలో పాల్గొంటాడు.
 
భారీ బ‌డ్జెట్టుతో రూపొంద‌నున్న ఆ సినిమా 1945 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ట‌. అందుకే సినిమా పేరును కూడా 1945గానే నిర్ణ‌యించిన‌ట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో రానా స‌ర‌స‌న అందాల భామ రెజీనాని క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో రానా లుక్ సరికొత్త విధంగా కనిపిస్తుందట. బాహుబ‌లి త‌ర‌హాలోనే కొంత‌కాలం పాటు వ‌ర్క్‌షాప్‌లో పాల్గొని 1945 కోసం రంగంలోకి దిగుతార‌ని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
1945 కాలంనాటి లవ్ స్టోరీగా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే.. బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్‌లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క ఘాజీతోపాటు, తేజ చిత్రంలోనూ న‌టిస్తున్నాడు రానా.  బాహుబ‌లి కూడా పూర్త‌యిందంటే ఆయ‌న మ‌రిన్ని సినిమాల‌తో రానా బిజీ అవుతాడ‌ని సినీ వర్గాలు అంటున్నాయి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments