Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది పెడితే అంత రాద్దాంతమెందుకు అంటున్న రష్మిక..

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (14:03 IST)
తెలుగు చిత్ర సినీపరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక మందన. కన్నడ సినీపరిశ్రమకు చెందిన హీరోయిన్ అయినా తెలుగును బాగా అర్థం చేసుకుని అర్థవంతంగా నటిస్తున్న నటీమణుల్లో రష్మిక ఒకరు. ఛలో విజయం తరువాత గీత గోవిందం సినిమా రష్మికకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరోసారి తెలుగు సినీప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మిక.
 
అయితే డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌లో ముద్దు సీన్లు అభ్యంతకరంగా మారింది. దీంతో రష్మికను అభిమానించే వారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రష్మిక ఎందుకు ఇలాంటి సీన్లలో నటిస్తుందంటూ ప్రశ్నించిన వారు లేకపోలేదు. గీత గోవిందంలో ముద్దు సీన్ ఉన్నా అది కథ పరంగా ఉండటంతో అభిమానులు పట్టించుకోలేదు. కానీ డియర్ కామ్రేడ్ సినిమాలో మాత్రం ఆ ముద్దు సీన్‌ను అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఇదే విషయంపై ట్విట్టర్లో రష్మికకు ట్వీట్లు చేస్తున్నారట అభిమానులు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించింది రష్మిక. ముద్దు పెట్టించుకుంటే అంత రాద్దాంతం చేస్తున్నారెందుకు... కథ పరంగా ఆ ముద్దు సీన్లో నటించాను. సినిమాను సినిమాలాగానే చూడండి. అనవసరంగా పోస్టులు చేయడం మానండి. నేను ఇప్పుడిప్పుడే సినీపరిశ్రమలో నిలదొక్కుకుంటున్నా. నన్ను ఎదగనీయండి అంటూ అభిమానులను కోరుతోంది రష్మిక మందన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments