Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..... నిజమా?

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి నటించనున్నారు. అయితే, ఇలాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై టాలీవుడ్

Webdunia
సోమవారం, 3 జులై 2017 (13:53 IST)
స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి నటించనున్నారు. అయితే, ఇలాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడి జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరా అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌పై ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్యతో ‘పైసా వసూల్’ మూవీ చేస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పిన మాట ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పాటు ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చిన పూరీ జగన్నాథ్.. ‘వర్మ-బాలయ్య’ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘రక్తచరిత్ర, వంగవీటి’ వంటి సినిమాలు తీసిన వర్మ.. మనసుపెట్టి ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే ఆ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమని సినీ జనాలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments